
పోలీసు ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు
పార్వతీపురం రూరల్: రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పోలీసుశాఖ ఉన్నతాధికా రులు, అలాగే సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని (మాస్టర్ హెల్త్‌చెకప్) సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్‌డివిజన్‌ల పరిధిలో ఉన్న స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది, ఏఆర్, మినీస్టీరియల్ సిబ్బంది, హోం గార్డులకు ఈ కార్యక్రమం ద్వారా పలు ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ పరీక్షలు విజయనగరంలో ఉన్న మెడికవర్, శ్రీకాకుళంలో మెడికవర్ ఆస్పత్రుల్లో నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.