
95:5 నిష్పత్తిలో బియ్యం సరఫరా
రామభద్రపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95:5 శాతం నిష్పత్తిలో జిల్లాలో ఉన్న 5,71,288 రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తు న్నట్టు డీఎస్‌ఓ మధుసూదనరావు తెలిపారు. మండలంలోని పలు రేషన్ దుకాణాలను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొత్తకార్డుల కోసం 53,500 దరఖాస్తులు రాగా 37,351 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించామని, వారికి త్వరలో స్మార్ట్ కార్డులు మంజూరుచేసే అవకాశం ఉందన్నారు.
పకడ్బందీగా ఏపీపీఎస్‌సీ పరీక్షలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న లెక్చరల్ పోస్టుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. రాజాంలోని జీఎంఆర్, జొన్నాడ లెండీ, గాజులరేగ వద్ద ఉన్న ఐయాన్ డిజిటల్ జోన్, చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్షల ఏర్పాట్లపై ఆరా తీశారు. సమావేశంలో ఏపీపీఎస్‌సీ, పోలీస్, రెవెన్యూ, ప్రజా రవాణా, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ అఽధికారులు పాల్గొన్నారు.