
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
వీరఘట్టం: కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గుండాల దాడిని ఆమె ఖండించారు. మండలంలోని వండువ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలైన హారిక గుండాల దాడిలో భయంతో వణికిపోయారని ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది పాలన గడిపేశారన్నారు. కూటమి నేతల అరాచకాలకు బలవుతున్న వారికి వైఎసా్‌స్‌ర్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పేరిట తల్లిదండ్రులను మోసం చేసిందని ఆరోపించారు.
ఉప్పాల హారికపై టీడీపీ, జనసేనల దాడి దారుణం
కూటమి ప్రభుత్వ తీరుపై ఎంపీ తనూజారాణి ధ్వజం