
పడిపోయిన నిమ్మ ధర
సీతంపేట: సీతంపేట మార్కెట్‌కు భారీగా నిమ్మకాయలు ఆదివారం వచ్చాయి. అనుకున్న ధర లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందారు. గతంలో 50 కిలోల వరకు ఉన్న నిమ్మ బస్తా రూ.5 వేలు పైబడి పలుకగా ఇప్పుడు బస్తా రూ.500లకు పడిపోయిందని నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం, ఒడిశా, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లారు. కొండపోడు వ్యవసాయంలో భారీగా ఈ ఏడాది మంచి దిగుబడులు వచ్చాయి. దిగుబడులు వచ్చిన వాటిని సీతంపేట, కుశిమి, మర్రిపాడు వారపు సంతల్లో విక్రయిస్తారు. ఇప్పుడు ధరలు పూర్తిగా పడిపోయాయని గిరిజనులు వాపోతున్నారు.
సీతంపేట మార్కెట్‌కు భారీగా నిమ్మకాయలు
బస్తా నిమ్మ ధర రూ.500లు
గతంలో ఇదే సీజన్‌లో బస్తా రూ.5వేలు