
ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
● ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్
విజయనగరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డీఏ, సరండర్ లీవ్ క్యాష్‌ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ డిమాండ్ చేశారు. స్థానిక ఆపస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల దాటినా పీఆర్‌సీ కమిషన్ నియమించలేదని ఆరోపించారు. వెంటనే కమిషన్ వేసి కనీసం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఇ.రామునాయుడు, అదనపు ప్రధాన కార్యదర్శి చిన్ని శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సంతోషలక్ష్మి, గౌరవాధ్యక్షులు వీవీ శ్రీహరి, కోశాధికారి ఏజీ తాతారావు, జిల్లా మహిళా ప్రతినిధి పద్మలత, విశాఖ జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్, వెంకటనాయుడు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.