
గుంటూరు, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు
పార్వతీపురం రూరల్: గుంటూరు, రాయగడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలన కోసం ఈగల్ టీమ్ ఐజీ ఆకె రవికృష్ణ, ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పేరిట శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈగల్ టీం, జిల్లా పోలీస్‌శాఖ, డాగ్‌స్క్వాడ్, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాయి. ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో జనరల్ బోగీల నుంచి ఏసీ బోగీల వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1972 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నంబర్‌కు సమాచారం ఇస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

గుంటూరు, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు