
పండగపూట పురుగుల బియ్యమేనా?
వీరఘట్టం: ప్రతీ పాఠశాలలో మెగా పేరెంట్–టీచర్స్‌డేను పండగలా నిర్వహించాలని సూచించిన ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఇచ్చే బియ్యం నాసిరకంగా ఉండడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. పురుగుల బియ్యం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలలో పురుగుల ఉన్న బియ్యంనే వంట ఏజెన్సీ మహిళలకు ఇవ్వడంతో ఆ బియ్యంను చేటతో చెరిగి, నీటిలో శుభ్రంచేసి వంటచేశారు.
వారం రోజుల కిందట బియ్యంలో పురుగులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇంత వరకు ఆ బియ్యంను మార్చకపోవడం దారుణమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. మీ పిల్లలకై తే ఇటువంటి పురుగుల బియ్యమే వండుతారా అంటూ ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

పండగపూట పురుగుల బియ్యమేనా?