
‘వసుదైక కుటుంబం’ సేవలు శ్లాఘనీయం
బాడంగి: కర్నాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన వసుదైక కుటుంబం (యూనివర్సిల్ ఫ్యామిలీ ఫౌండేషన్) స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు శ్లాఘనీయమని వక్తలు కొనియాడారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అనాథ బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. హెచ్‌ఎం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు డి.శ్రీనివాసరావు, సర్పంచ్ కండి రమేష్, పీఎంసీ కార్యదర్శి శ్రీనివాసరావు, భవిత టీచర్ ఈశ్వరరావు మాట్లాడుతూ.. సంస్థ వ్యవస్థాపకుడు రెళ్ల శ్రీనివాసరావు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. సంస్థ డైరెక్టర్ సత్యకుమార్ మాట్లాడుతూ.. కేబీఎన్‌బీఎఫ్‌సీ సహకారంతో 200 సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఆఖరులో వంద మంది విద్యార్థులకు వెయ్యి రూపాయలు చొప్పున స్కాలర్‌షిప్ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 36 పాఠశాలలకు చెందిన బాలికలు, తల్లిదండ్రులు హాజరయ్యారు.