
23 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
విజయనగరం: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23,24,25 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలతో పాటు, రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ చైర్మన్, అధ్యక్షుడు కొండపల్లి అప్పలనాయుడు, ద్వారపురెడ్డి జగదీష్‌లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న పోటీలు అండర్–11,13,15, 17, 19 వయస్సుల విభాగాల్లో జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా ఈనెల 23న అండర్–19 విభాగంలో బాల, బాలికలకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో, 24న అండర్–15,17 వయస్సుల విభాగాల్లో, 25న అండర్–11, 13 వయస్సుల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆయా విభాగాల్లో జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అదే రోజు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఏ కేటగిరీలోనైనా 6 జట్ల కన్నా తక్కువ జట్లు వస్తే చాంపియన్‌షిప్ నిర్వహించకుండా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక ప్రక్రియ మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9133773485, 79891 99534, 7981111705 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి నున్న సురేష్, ఎంకేబీ శ్రీనివాసరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు నిర్వహణ