మీ | - | Sakshi
Sakshi News home page

మీ

Jul 9 2025 7:29 AM | Updated on Jul 9 2025 7:29 AM

మీ

మీ

యూరియా..
దొరికితే అదృష్టం!

పీఏసీఎస్‌ల్లో కానరాని ఎరువు నిల్వలు

ప్రైవేట్‌ వర్తకుల వద్ద అధిక ధరలు

అదనంగా ఇంకేదైనా తీసుకోవాలని మెలిక

ఆవేదనలో రైతన్న

● కొమరాడ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. నిల్వలు వస్తున్నా.. కూటమి నాయకులే ‘సర్దుకుంటున్నారు’. మండలంలో కొమరాడ, శివిని పీఏసీఎస్‌లు ఉండగా.. ఇటీవల 180 చొప్పున బస్తాలు వచ్చాయి. అవి కూటమి నాయకులు, కార్యకర్తలకే సరిపోయాయి. రైతు సేవా కేంద్రాలకు ఇండెంట్‌ పెట్టామనే ఇంకా అధికారులు చెబుతున్నారు. రూ.267 ఉన్న యూరియా బస్తా పార్వతీపురంలోని ప్రైవేట్‌ వర్తకులు రూ.350 చొప్పున విక్రయిస్తున్నారు. మండలానికి తీసుకొచ్చి విక్రయించేసరికి ధర రూ.450 అవుతోంది. డీఏపీ కూడా నిల్వలు లేవు. వరికి డీఏపీ, యూరియా లేకపోతే దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

● సాలూరు మండలంలోని మామిడిపల్లి, సాలూరు, శివరాంపురం తదితర పీఏసీఎస్‌ల్లో ఎక్కడా డీఏపీ, యూరియా నిల్వలు లభించడం లేదు. ఇటీవల శివరాంపురం పీఏసీఎస్‌లో 16 గ్రామాల రైతులు ఉదయం నుంచి ఎరువు కోసం బారులు తీరారు. అందులో 20 శాతం మందికి కూడా ఎరువు దొరకలేదు. బయట ఎక్కడైనా లభించినా.. రూ.50 అదనంగా తీసుకోవడమే కాక, దాంతోపాటు రూ.300కు తగ్గని పురుగు మందు ఏదైనా తీసుకోవాలని కొర్రీ పెడుతున్నారు.

● సీతానగరం మండలంలో యూరియా నిల్వలు వస్తే.. రైతుల కంటే ముందు టీడీపీ కార్యకర్తలకే సమాచారం వెళ్తోంది. దీంతో వారు రాత్రికి రాత్రే స్లిప్పుల రాసి తమ కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారు. స్లిప్పులు ఉన్న వారికే బస్తాలు ఇస్తున్నారు. బూర్జ, లక్ష్మీపురం గ్రామాల్లోని రామమందిరాల వద్ద మంగళవారం యూరియా పంపిణీ చేయగా.. అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది.

● మక్కువ మండలంలోనూ పూర్తిస్థాయిలో నిల్వలు దొరకడం లేదు. ఇక్కడ ఎరువుల ధరల్లో వ్యత్యాసాలు ఉండడంతో కొద్దిరోజుల కిందట అధికారులు దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు. శంబరలోని ఓ దుకాణంలో వ్యత్యాసాన్ని గుర్తించారు. 2,399 బస్తాల్లోని 119.925 టన్నుల ఎరువు సీజ్‌ చేశారు.

● పాలకొండ మండలంలోనూ డీఏపీ, యూరియా లభించడం లేదు. స్థానికంగా లభ్యమవుతుందని ఇన్నాళ్లూ చూసిన రైతులు.. అదును దాటిపోవడంతో బయట మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేసుకుంటున్నారు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

పార్వతీపురం మన్యం జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో మెట్ట పంటల సాగుతో పాటు వరి నాట్లు ఆరంభమయ్యాయి. వరి వెదలు, నారుమడులు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు వేయాల్సిన సమయం ఇది. లేదంటే దిగుబడిపై ప్రభావం పడుతుంది. ఎరువుల కోసం పీఏసీఎస్‌లకు రైతులు పరుగులు తీస్తున్నా ప్రయోజనం లేకపోతోంది. ఎక్కడా ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన ఉండడం లేదు. పీఏసీఎస్‌లు, ప్రైవేట్‌ వర్తకుల వద్ద గంటలకొద్దీ బారులు తీరుతున్నా ఎరువు దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో వచ్చిన కొద్దిపాటి నిల్వలనూ కూటమి నాయకులు తన్నుకుపోతుండడం గమనార్హం.

అదనపు వసూళ్లు..

యూరియా, డీఏపీ నిల్వలు లేవంటూ వ్యాపారులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. బస్తా వద్ద కనీసం రూ.50కి తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. దీంతోపాటు.. యూరియా కావాలంటే డీఏపీ తీసుకోవాల్సిందేనని, లేకుంటే ఇంకేదైనా పురుగు మందులు కొనాల్సిందేనని పట్టుపడుతున్నారు. కొన్నిచోట్ల సరైన రసీదులు కూడా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. మరికొందరుల నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. దీనిపై ఏటా ఆరోపణలు వస్తున్నా.. అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం. జిల్లాలోని ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని రకాల పంటలూ కలిపి సుమారు 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతాయి. వరి ఒక్కటే 1.70 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ సీజన్‌లో ఖరీఫ్‌కు అవసరమైన సుమారు 45,277 మెట్రిక్‌ టన్నులను అధికారులు సిద్ధం చేశారు. రైతు సేవా కేంద్రాలతోపాటు.. మార్క్‌ఫెడ్‌, ప్రైవేట్‌ వర్తకులు, పీఏసీ

ఎస్‌ల్లో నిల్వలను అందుబాటులో ఉంచారు. క్షేత్రస్థాయికి వచ్చేసరికి రైతులకు ఎరువుల కోసం ఇబ్బందులు తప్పడం లేదు.

కొరత లేదంటున్న అధికారులు

జిల్లాలో ఒకవైపు రైతులు ఎరువుల కోసం అవస్థలు పడుతుంటే.. అధికారులు మాత్రం ఎక్కడా కొరత లేదని అంటున్నారు. జూలై చివరి నాటికి జిల్లాలో దాదాపు 21,542 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 19,357 మెట్రిక్‌ టన్నులు వచ్చాయని.. వాటిని పంపిణీ చేశామని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రారంభ నిల్వతో సహా 8,920 మెట్రిక్‌ టన్నుల లభ్యత ఉందని చెబుతున్నారు. 3,563 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2,293 ఎంటీల డీఏపీ, 1,501 ఎంటీల కాంప్లెక్స్‌, 570 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌, 990 మెట్రిక్‌ టన్నుల సూపర్‌ ఫాస్పెట్‌ ఉన్నాయని అంటున్నారు. కొద్ది రోజుల్లో 5 వేల టన్నుల యూరియా, మూడు వేల టన్నుల డీఏపీ వస్తుందని కలెక్టర్‌

తెలిపారు. కొరత లేదని.. అంతా సవ్యంగా ఉందని చెబుతున్న అధికారులకు గ్రామాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు కనిపించకపోవడం శోచనీయమన్న వాదన వినిపిస్తోంది.

మీ 1
1/1

మీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement