
త్రికరణశుద్ధితో ఇచ్చిన హామీలు
–8లో
పెంపకం.. కావాలి అప్రమత్తం..!
మానవ జీవనంలో జంతువులు సైతం
భాగమయ్యాయి. వీటి పెంపకంలో అప్రమత్తతే ప్రధానమన్నారు.
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
● ప్రజల ఆశతో చంద్రబాబు రాజకీయం
● బాబు వంద అబద్ధాలు చెబితే.. లోకేశ్ రెండొందలు చెబుతారు
● మీ అరుపులకు, బెదిరింపులకు అదరం
● ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి నయవంచన పాలనను వివరిస్తాం
● శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ
● వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ప్రజలకు ఉన్న ఆశతోనే చంద్రబాబు రాజకీయం చేస్తారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రధానంగా రెండు వర్గాలను లక్ష్యంగా చేసుకుంటారు. మహిళలను, రైతులను దగా చేస్తారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం.. రెండు ప్రతి పక్షం. ప్రజా సమస్యలపై వారి గొంతుకగా నిలవడం.. ఇచ్చిన హామీల అమలుకు నిలదీయడం ప్రతిపక్ష బాధ్యత. త్రికరణ శుద్ధిగా చెబుతున్నామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?’ అని శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘హామీలు అమలు చేయాలని అడిగితే అరుస్తారు.. బెదిరిస్తారు.. కేసులు పెడతారు. తాట తీస్తాం.. తోక కత్తిరిస్తాం.. మక్కలు ఇరగ్గొడతాం.. నాలుక మందం అంటారు. ఇది మంచి సంప్రదాయం కాదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అధ్యక్షతన శనివారం జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స మాట్లాడుతూ.. 40 శాతం ఓట్లు ఉన్న తమకు ప్రజల తరఫున అడిగే హక్కు ఉందన్నారు. 13 నెలలైనా మేనిఫెస్టోలో ఉన్న హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని చెప్పారు. ఇస్తున్నవీ అరకొరగానే అని తెలిపారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఎన్నికలప్పుడు పార్వతీపురం నుంచి తిరుపతికి ఉచిత బస్సు ప్రయాణమన్నారని.. తర్వాత శాసనమండలిలో మాట మార్చి, జిల్లాకే పరిమతమంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో ఉన్న ఉద్యోగాలు సైతం తీసేసి, నిరుద్యోగ భృతి లేకుండా చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో హామీల అమలు కోసం మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయలేక బీరువాలో పెట్టారని
బాబు ష్యూరిటీ.. వంద శాతం మోసం గ్యారంటీ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతోంది. బాబు ష్యూరిటీ ఇస్తే.. వంద శాతం మోసం గ్యారంటీ అని మరోసారి నిరూపితమైంది. మోసం, వెన్నుపోటుతోనే గత ఎన్నికల్లో గెలిచారు. గెలిచాక కేవలం కుర్చీకే పరిమితమయ్యారు. ఓడినా ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి జగన్. కూటమి ఏడాది పాలనలో అరాచకాలు పెరిగిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా తట్టుకోలేక రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. మూడు పార్టీలు కలిసివచ్చి 52 శాతం ఓట్లు సాధిస్తే.. వైఎస్సార్‌సీపీ ఒక్కటిగానే వచ్చి 40 శాతం ఓట్లు దక్కించుకుంది. అదీ ప్రజాబలం అంటే..
– గుమ్మ తనూజారాణి, ఎంపీ, అరకు పార్లమెంట్ నియోజకవర్గం
స్కీం ఆంధ్రాను.. స్కాం ఆంధ్రాగా మార్చారు...
అధికారంలోకి వచ్చాక కూటమి ప్రజలను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం.. అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అవినీతికి అడ్డాగా మారింది. అసమర్థ పాలనకు నిదర్శనమైంది. జగన్ స్కీం ఆంధ్రా చేస్తే.. వీరు స్కాం ఆంధ్రాగా మార్చారు. వైఎస్సార్‌సీపీ విద్యాంధ్ర చేస్తే.. కూటమి మద్యాంధ్రగా మార్చింది. జగనన్న గోరుముద్ద పెడితే.. వీరు బొద్దింకల ముద్ద పెడుతున్నారు. అమరావతి అని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇసుక, మద్యం, మైనింగ్.. ఇలా అన్నింటా అక్రమాలే. చివరికి మధ్యాహ్న భోజనాన్నీ స్కాం చేశారు. వెన్నుపోటు, నయవంచన, అరాచకాలు బాబు పాలనలో పక్కా గ్యారంటీ. ఈ ప్రభుత్వంలో ఒక్క పేదవాడూ రిచ్ కాలేడు గానీ.. ఎమ్మెల్యేలు మాత్రం రిచ్ అవుతున్నారు. కురుపాం ఎమ్మెల్యే రిచ్ అయ్యే పనిలోనే ఉన్నారు. జగన్‌ను, వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టలేరు. మీరు భూస్థాపితం చేయడం కాదు.. మీరు అధికారంలో ఉన్న పీఠాల కింద భూకంపం తీసుకొస్తాం.
– పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి
ఎద్దేవా చేశారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చంద్రబాబు కొడుకు లోకేశ్ తీరు ఉందన్నారు. తండ్రి వంద అబద్ధాలు ఆడితే.. కుమారుడు 200 ఆడుతారని విమర్శించారు. అన్నదాత సుభీభవ కార్యక్రమాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఏడాది పూర్తయినా కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్ర హామీ ఏమైందన్నారు. సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన మంత్రి లోకేశ్.. ఏ ఏడాది మే నెలలో ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థులపై ఆడపిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీ ఝులిపించడం ధర్మం కాదన్నారు. ‘జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో మోసాలను వివరిస్తాం.. హామీలు అమలు చేసే వరకూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. బెదిరింపులకు ఎవరూ బెదిరిపోరు.. అని బొత్స అన్నారు.
న్యూస్‌రీల్
చంద్రబాబు చేసిందంతా మోసమే..
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ప్రభుత్వ విద్య బలోపేతమైంది. వరుసగా మూడు సంవత్సరాలు మన్యం జిల్లా పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఏం సాధించింది? గత ఎన్నికల్లో మోసంతో గెలిచింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజాబలం ఏమిటో చూపించాలి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ.. రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంశాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి వివరించాలి. చంద్రబాబు చేసేది, చెప్పేది అంతా మోసమే.
– మజ్జి శ్రీనివాసరావు,
ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్

త్రికరణశుద్ధితో ఇచ్చిన హామీలు

త్రికరణశుద్ధితో ఇచ్చిన హామీలు

త్రికరణశుద్ధితో ఇచ్చిన హామీలు