
మంత్రి ఇలాకాలో ఎరువు కరువు
ఈ చిత్రం చూశారా... వర్షంలో గొడుగులు వేసుకుని ఉన్నది రైతన్నలు. పత్తి, మొక్కజొన్న, వరి నారు మడులకు వేసేందుకు అవసరమైన ఎరువుకోసం సాలూరు మండలం శివరాంపురం పీఏసీఎస్ వద్ద శనివారం ఉదయం 6 గంటల నుంచి క్యూ కట్టారు. సుమారు 16 గ్రామాల రైతులు పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. వచ్చిన వారిలో సగంమందికి కూడా ఎరువు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అదునుకు ఎరువు అందించకపోతే ఎలా అంటూ అధికారులను నిలదీశారు. కూటమి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. మంత్రి సంధ్యారాణి రైతన్నల ఎరువు కష్టాలను పట్టించుకోవడంలేదంటా ఆగ్రహం వ్యక్తంచేశారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఎంత ఎరువు కావాలంటే అంతమేర ఆర్‌బీకేల ద్వారా సరఫరా అయ్యేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ వాపోయారు. – సాలూరు రూరల్