
ఈసారి జగన్ 2.0
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. కూటమి వారు బెదిరించి కొంతమందిని తమవైపునకు తిప్పుకుంటున్నారు. ఇదంతా తాత్కాలికమే. వారంతా తిరిగి వైఎస్సార్‌సీపీకి చేరుకుంటారు. ప్రజల్లో మార్పు మొదలైంది. కూటమి అరాచకాలను, ఇచ్చిన హామీలను అమలు చేయక చేసిన మోసాలను ఇంటింటా వివరిద్దాం. శ్రేణులంతా సమాయత్తం కావాలి. గతంలో ప్రజల కోసం.. వారి తరఫున వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పని చేసింది. ఈసారి కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని అధినేత మాట ఇచ్చారు. జగన్ 2.0లో వారికే మొదటి ప్రాధాన్యం. వైఎస్‌ఆర్ సీపీని దేశంలోనే అతి బలమైన పార్టీగా చూస్తాం. – శత్రుచర్ల పరీక్షిత్ రాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
●