
చినుకుపడితే సాగని చదువులు
చిత్రంలో పిల్లలు చదువుతున్న రేకుల షెడ్ మక్కువ మండలంలోని గిరిశిఖర గ్రామమైన చిలకమెండంగిలోని సామాజిక భవనం. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు పక్కాభవనం లేదు. గత ప్రభుత్వం నాడు–నేడు కింద పక్కాభవనానికి నిధులు మంజూరు చేసినా నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితం.. వాతావరణం తెరిపిస్తే, ఆరుబయట చెట్ల కింద, వర్షం, ఎండ తీవ్రంగా ఉంటే గ్రామస్తులు చందాలతో నిర్మించుకున్న సామాజిక భవనం(రేకులషెడ్)లో ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న 22 మంది విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలకు చేరుకోవాలంటే రాళ్లు, రప్పలతో కూడిన ఎత్తైన రహదారే మార్గం.