
పింఛన్ డబ్బులు లబ్ధిదారులకే అందించాలి
పార్వతీపురం రూరల్: పింఛన్ డబ్బులను నేరుగా లబ్ధిదారులకే అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సచివాలయ సిబ్బందికి సూచించారు. పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంగళవారం పింఛన్లు అందజేశారు. జిల్లాలో 1,40,982 మందికి రూ.60 కోట్లు నగదును పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం ఆయన అక్కడి అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మౌలిక వసతులు, ఆహారం, పిల్లల విద్యాభ్యాసన తీరుపై ఆరా తీశారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించిన కలెక్టర్ స్టోర్ రూమ్‌లో నిత్యావసర సరుకులు, కోడిగుడ్ల నిల్వల రికార్డులు నిర్వహణను పరిశీలించారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
అడ్డాపుశీలలోని స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న వస్త్ర వ్యాపారాన్ని కలెక్టర్ పరిశీలించారు. మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగాలన్నారు. సీ్త్ర నిధి నుంచి పొందిన రుణంతో వస్త్రవ్యాపారాన్ని నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్

పింఛన్ డబ్బులు లబ్ధిదారులకే అందించాలి