
సమాజంలో వైద్యులకు ప్రత్యేక స్థానం
పార్వతీపురంటౌన్: సమాజంలో వైద్యునికి ప్రత్యేక స్థానం ఉందని, ప్రజారోగ్యమే ధ్యేయంగా అంకితభావంతో వైద్య సేవలందజేయాలని డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు కోరారు. జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో వైద్య సేవల నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందజేస్తున్న వారిని అభినందించారు. వైద్యవృత్తిలో అంకిత భావంతో పాటు సేవావృక్పథం అలవర్చుకుంటే ప్రజలకు మెరుగైన వైద్యం అందడమే గాక, మనకెంతో సంతప్తి నిస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు జగన్మోహన్, రఘు, వినోద్, నగేష్ రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ భాస్కరరావు