తల్లికి వందనం అందలేదు
సాలూరు: సాలూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ శ్యామ్‌ప్రశాద్ ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డ్వామా పీడీ రామచంద్రరావు అర్జీలు స్వీకరించారు. మొత్తం 154 అర్జీలు అందగా, రెవెన్యూ, తల్లికి వందనం పథకం అందలేదన్నవే అధికంగా ఉన్నాయి. తన ముగ్గురు పిల్లలు లలిత, లక్ష్మి, మణికుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, తల్లికి వందనం పథకం వర్తించలేదంటూ పార్వతీపురం మండలం డోకిశీల సచివాలయం పరిధిలోని జోగిదొరమెట్టవలస 6గామానికి చెందిన జట్టమ్మ తన పిల్లలతో కలిసి కలెక్టర్‌కు గోడువినిపించింది. భూమి అధికంగా ఉందని, అధిక విద్యుత్ విని యో గం, ఇన్‌కంట్యాక్స్, తదితర సమస్యలతో తమకు తల్లికి వందనం రాలేదంటూ పలువురు అర్జీలు అందజేశారు. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు చేశారు.
తల్లికి వందనం అందలేదు


