స్కూటర్‌ ఢీ కొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూటర్‌ ఢీ కొని వ్యక్తి మృతి

May 29 2025 1:07 AM | Updated on May 29 2025 1:07 AM

స్కూట

స్కూటర్‌ ఢీ కొని వ్యక్తి మృతి

విజయనగరం క్రైమ్‌: నగరానికి సమీప గ్రామం చెల్లూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. చెల్లూరు గ్రామానికి చెందిన అప్పలనాయుడు విశాఖ–విజయనగరం హైవేపై రాంగ్‌ రూట్‌లో సాయంత్రం 4 గంటలకు రోడ్డు దాటుతుండగా ఎదురుగా స్కూటర్‌ రావడంతో ఢీ కొనగా అక్కడిక్కడే కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించే లోగానే తుదిశ్వాస విడిచాడు. మృతుడి కుమార్తె రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్సై అశోక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు..

బొబ్బిలి: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని బలిజిపేట రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనపై సీఐ కె.సతీష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జగ్గునాయుడి పేటకు చెందిన శ్రీనివాసరావు తాపీ, సెంటరింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శనివారం పట్టణంలోని టీచర్స్‌కాలనీకి బైక్‌పై వెళ్తుండగా బలిజిపేట రోడ్డులోని ఇండియన్‌ బ్యాంకు వద్దకు చేరుకునేసరికి వెనుక నుంచి వస్తున్న శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో బస్సు వెనక చక్రాలకింద పడి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇందిర, పాలిటెక్నిక్‌ చదివిన పవన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్న చంటి అనే ఇద్దరు కుమారులున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ప్రమాద వాహనాలను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. ట్రాఫిక్‌ ఎస్సై వి.జ్ఞానప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ ఇంకొకరు..

గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..ఈనెల 25వతేదీ రాత్రి గంట్యాడ మండలంలోని రామవరం జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని బైక్‌ పై వస్తూ ఢీకొట్టిన సారిక గ్రామానికి చెందిన కింతాడ మధు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు కేజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు.

కుక్క కరిచి వైఎస్సార్‌సీపీ కార్యకర్త..

రామభద్రపురం: మండలంలోని కొండకెంగువలో కుక్క కరిచి వైఎస్సార్‌సీపీ కార్యకర్త బుధవారం మృతిచెందాడు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త,గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్‌గా పనిచేసిన సత్తారు సన్యాసిరావు(34)ఈ నెల 3వ తేదీన కుక్కకాటుకు గురయ్యాడు. దీంతో వెంటనే గ్రామ పరిధిలో ఉన్న ఆరికతోట పీహెచ్‌సీకి వెళ్లి రేబిస్‌ టీకా వేసుకున్నాడు. మూడు డోసులు వేసుకోవాల్సి ఉండగా ఇప్పటివరకు రెండు డోసులు వేసుకున్నాడు.వచ్చే నెల ఒకటో తేదీన మూడో డోసు వేసుకోవాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ నెల 27వ తేదీన తలనొప్పి, కుక్క కరిచిన వైపు తిమ్మిర్లు వచ్చాయి. ఆఖరి డోసు రేబిస్‌ వేసుకుంటే తగ్గిపోతుందన్న ఉద్దేశంతో మిన్నకుండిపోగా బుధవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు.

స్కూటర్‌ ఢీ కొని వ్యక్తి మృతి1
1/3

స్కూటర్‌ ఢీ కొని వ్యక్తి మృతి

స్కూటర్‌ ఢీ కొని వ్యక్తి మృతి2
2/3

స్కూటర్‌ ఢీ కొని వ్యక్తి మృతి

స్కూటర్‌ ఢీ కొని వ్యక్తి మృతి3
3/3

స్కూటర్‌ ఢీ కొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement