
బతుకు బండిని ఆపేసింది!
●గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకు ఇంకా 2027 వరకు అంటే 18 నెలల సమయం ఉందని.. ఈలోగా తమ వాహనాలను నిలుపు చేయడం భావ్యం కాదని వాహనదారులు చెబుతున్నారు.
●జిల్లాలో 196 వాహనాలుండగా.. తమతోపాటు, కుటుంబం, హెల్పర్స్, వారి కుటుంబ సభ్యులంతా ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడాల్సి వస్తుందని అంటున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని కోరుతున్నారు.
●వాహనం ధర రూ.5,81,190 కాగా..
ఇంకా నెలకు రూ.9వేల వరకు ఈఎంఐ రూపంలో కట్టాలని.. ఆ మొత్తం ఎలా
కట్టగలమని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం అడిగితే.. వాహనాలు తమకే ఇచ్చేస్తామని అంటున్నారని.. వాటికి సంబంధించిన
ఈఎంఐ, రోడ్డు ట్యాక్స్, బ్రేక్ చేయించే ఖర్చులన్నీ ఎవరు భరిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ జీవనాధారాన్ని నిలుపు చేసిందని.. దీనివల్ల కుటుంబాలతో సహా రోడ్డున పడ్డామని రేషన్ ఎండీయూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులమయ్యామని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వాపోయారు. ఇంటి వద్దకే రేషన్ పథకంలో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టిన విషయం విదితమే. వీటి వల్ల ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే లబ్ధిదారుల ఇళ్ల సమీపంలోకే వాహనాలు వెళ్లి సరకులు అందించేవి. జూన్ 1 నుంచి ఆ వ్యవస్థను నిలిపివేస్తున్నామని కూటమి ప్రభు త్వం ప్రకటించడంతో.. వాటి మీదే ఆధారపడి ఉన్న వాహనదారులు, హెల్పర్లు ఉపాధి కోల్పోయారు. ఈ నెల 18వ తేదీ వరకు షెడూల్ ప్రకారం సరకులి చ్చామని.. 19వ తేదీ నుంచి ఇంక విధుల్లోకి రావద్ద ని ఉన్నఫలంగా అధికారులు చెప్పేశారని వారు చెబుతున్నారు. కనీసం ఎటువంటి ముందస్తు సమాచారమూ ఇవ్వడం లేదని వాపోయారు.
కలెక్టరేట్ వద్ద వాహనాలతో నిరసన
పార్వతీపురం అర్బన్, మండల పరిధిలోని 24 మంది ఎండీయూ వాహనదారులు తమ వాహనాలతో పాటు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గేటు వద్ద నిరసన తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లోనూ ఆయా మండల అధికారులకు తమ ఉపాధి తీయవద్దని వినతిపత్రాలు అందజేశారు.
కూటమి ప్రభుత్వం నిర్ణయంతో
రోడ్డున పడ్డాం
ఎండీయూ వాహనదారుల ఆవేదన
జిల్లావ్యాప్తంగా అధికారులకు వినతులు
కలెక్టరేట్ వద్ద వాహనాలతో నిరసన
చాలా అన్యాయం
కనీసం ఒక నోటీసైనా ఇవ్వకుండా, రాత్రికి రాత్రే ఎండీ యూ వాహన వ్యవస్థను రద్దుచేస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా అన్యాయం. మా ఉపాధి పోయింది. కుటుంబాలతో సహా వీధిన పడ్డాం. ఇప్పుడు ఎలా బతకాలి. ఈ వయసులో ఇంకేం ఉపాధికి వెళ్లగలం. ఈ వాహనాలనే నడుపుకోవాలని అంటున్నారు. వీటిని పాసింజ ర్ సర్వీసులకై నా నడుపుకోగలమా?
– వంగపండు నరేష్, పెదబొండపల్లి
వాహన బకాయిలే కట్టాలి..
ఇంకా వాహన బకాయిలే పూర్తిగా తీరలేదు. 2027 వరకు సమయం ఉంది. కనీసం అప్పటివరకైనా ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వాలి. ఉపాధి లేక, వాహన నెలవారీ మొత్తం ఎలా కట్టాలో తెలియడం లేదు. ప్రభుత్వ నిర్ణయం చాలా దారుణం
– శంబంగి లక్ష్మునాయుడు, చినబొండపల్లి
ప్రజలకూ ఇష్టం లేదు..
ఇప్పుడు మళ్లీ రేషన్ దుకా ణాలకు వెళ్లి సరకులు తీసు కోవాలంటే ప్రజలకే ఇష్టం లేదు. విషయం తెలిసి మమ్మల్ని అడుగుతున్నా రు. మేమేం చేయగలం. మా ఉపాధే పోయింది. ప్రజలకు ఇష్టం లేని నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. – ప్రసాద్, పార్వతీపురం

బతుకు బండిని ఆపేసింది!

బతుకు బండిని ఆపేసింది!

బతుకు బండిని ఆపేసింది!