
ఉద్యోగికిరిలీవర్రీ!
–8లో
బెట్టింగ్ మాయలో పడి..!
ఐపీఎల్ బెట్టింగ్‌లు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఓటమి నుంచి బయటపడేందుకు దొంగలుగా మార్చుతున్నాయి.
బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం: ఎట్టకేలకు ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఆ సంతోషం లేదు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ బదిలీల సందడి కనిపిస్తున్నా.. మన్యం జిల్లాకు సంబంధించి ఉద్యోగులు ‘ఓ ప్రయత్నం చేద్దాం..’ అన్న ధోరణిలోనే కనిపిస్తున్నారు. ఇందుకు కారణం ‘రిలీవర్’. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది కొన్ని శాఖల్లోనే బదిలీల ప్రక్రియ చేపట్టగా.. ప్రస్తుతం దాదాపు అన్ని శాఖలకూ సడలింపు ఇచ్చింది. 2025 మే 31 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు స్థానచలనం తప్పదని స్పష్టం చేసింది. ఐదేళ్లు సర్వీసు పూర్తికాని వారికీ దరఖాస్తు చేసుకునే వీలుంది. వారి విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని, పరిపాలన సౌలభ్యానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు. వచ్చే నెల 2వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
పాపం.. జిల్లా ఉద్యోగులు
ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఆయా శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన విషయం విదితమే. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ ఉద్యోగుల బదిలీలను ఉమ్మడి జిల్లా యూనిట్‌గానే పరిగణనలోకి తీసుకోన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లా విభజన జరిగి, కొత్త జిల్లా ఏర్పడి మూడేళ్లకుపైగా అవుతోంది. అప్పట్లో కొత్త జిల్లా ఏర్పాటు కోసమని విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి కొంతమంది ఉద్యోగులను పార్వతీపురం మన్యానికి బలవంతంగా పంపించారు. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా కలెక్టరేట్ సముదాయం ఏర్పడింది. రెవెన్యూ, విద్య, వైద్యం, ట్రెజరీ, వ్యవసాయం, ఐసీడీఎస్, పోలీస్, ఎకై ్సజ్.. ఇలా అన్ని శాఖల జిల్లా కార్యాలయాలూ ఏర్పడ్డాయి. కొత్తగా విద్యుత్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటైంది. జిల్లా కేంద్రంతో పాటు.. నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఇతర జిల్లాల నుంచి వచ్చి పని చేస్తున్న జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. కుటుంబాలతో ఇక్కడికి రాలేక.. పిల్లల చదువు కోసమని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లోనే ఉంటూ, రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా దాదాపు 1,500 మందికిపైగా ఇతర ప్రాంతాల ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారు. బదిలీలకు అవకాశమిస్తే తమ స్వప్రాంతాలకు వెళ్లిపోదామని ఎదురుచూస్తున్నారు.
న్యూస్‌రీల్
రిలీవర్ ఉంటేనే బదిలీ..
సిఫారసు లేఖతోపాటు, ఇక్కడ పని చేసేందుకు ఉద్యోగిని తెచ్చుకోవాల్సిందే..
పార్వతీపురం మన్యం జిల్లాలో వింత పరిస్థితి
స్థానచలనం కోసం ఉద్యోగుల ఎదురుచూపు