
ఉగ్రవాదుల అన్వేషణలో కూటమి విఫలం
విజయనగరం అర్బన్: ఉగ్రవాదులను కనిపెట్టడం, వారి కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడంలో కూట మి ప్రభుత్వం విఫలమైందని హిందూ ధర్మ రక్షా సమితి ప్రతినిధులు శ్రీనివాస్, నందివాడ వేణుగోపాలరావు విమర్శించారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతూ విజయనగరం పట్టణంలోని సిరాజ్ కుటుంబం నివసిస్తున్న ఆబాద్‌వీధి, అంబటి సత్రం, అశోక్ నగర్ ప్రాంతాలవారితో కలిసి కలెక్టర్ అంబేడ్కర్‌కు కలెక్టరేట్‌లో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కొంతకాలంగా అంబటి సత్రం, ఆబాద్ వీధిలో మసీదులు, మదర్‌సాలు పెరిగిపోతున్నాయని, స్థానికులు కాకుండా గుర్తుతెలియన వ్యక్తులు ఇక్కడ నివసిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రభావజాలంతో అరెస్టు అయిన సిరాజ్‌తో పాటు ఆయన తండ్రి, అన్నయ్యను కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణానికి ఉగ్రముప్పు తప్పించాలని కోరారు.
హిందూ ధర్మ రక్షా సమితి