
మద్దతు ధర కల్పించాలి
పైనాపిల్‌కు ప్రభుత్వ పరంగా మద్దతు ధరలు కల్పించాలి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది దిగుబడి బాగా ఉంటుందని ఆశిస్తు న్నాం. సంతల్లోకి తెచ్చి విక్రయిస్తుంటే ఒక్కో పైనాపిల్ సీజన్ ఆఖరులో రూ.5కు పడిపోయి న సందర్భాలున్నాయి.
– ఎస్.ఫల్గుణరావు, పాండ్ర
గిరిజన సంతలు ఇలా..
పైనాపిల్ వ్యాపారం సంతల్లో కూడా జోరుగా సాగుతుంది. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, దోనుబాయిలో గురువారం, పొల్ల, కుశిమిలలో శనివారం వారపు సంతలు జరుగుతా యి. ఇక్కడకు వ్యాపారులు వచ్చి పంటను కొనుగో లు చేస్తారు. కొన్నిసార్లు వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యతను బూచిగా చూపి పంటను చౌకగా దోచుకుంటారన్నది గిరిజన రైతుల ఆరోపణ.