
బీసీలంటే అంత చులకనా?
● మహిళలన్న సానుభూతి లేకుండా తహసీల్దార్, మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కన్నీరు పెట్టించారు.. ● బుల్డోజర్ ఎమ్మెల్యే విజయచంద్ర హయాంలో సెటిల్మెంట్లు, దందాలు, ఆక్రమణలే.. ● పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఫైర్
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కు బీసీలంటే చిన్నచూపు ఉందని... కనీసం మహిళలన్న సానుభూతి కూడా లేకుండా వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన స్థానిక తహసీల్దార్ జయలక్ష్మిని, మున్సిపల్ చైర్‌పర్సన్‌ను వేధించి కన్నీ రు పెట్టించారని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారా వు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 నెలల కాలంలోనే ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అవినీతి, అక్రమా ల్లో ఆరితేరారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలను పక్కన పెట్టి.. అవినీతి, అక్రమాలు, వసూళ్లు, కబ్జాలు, బెదిరింపులపైనే దృష్టి సారించారని విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సోమ వారం మాట్లాడారు. ఒక బీసీ మహిళా తహసీల్దార్ ను అసభ్యపదజాలంతో దూషించడం దారుణమన్నారు. రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేయాలని మూడు నెలలుగా తహసీల్దార్‌ను ఎమ్మెల్యే విజయచంద్ర వేధిస్తున్నారని తెలిపారు. ఆమె కొద్దిరోజుల కిందట ఎందుకు సెలవుపెట్టి వెళ్లిపోయారని ప్రశ్నించారు. అంతా సవ్యంగా ఉంటే ములగ గ్రామంలో డిజిటల్ సిగ్నేచర్‌లను ఎమ్మెల్యే చెబితే ఒక తహసీల్దార్ ఎందుకు చేయరన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని, తనది కాని భూమిని ఆన్‌లైన్‌లో పెట్టాల నడం సబబేనా అని ప్రశ్నించారు. సర్వే నంబర్ 137లో కొంత భూమిని రికార్డు ట్యాంపరింగ్ చేసి ఇన్ కార్పొరేషన్ చేయాలని ఆమైపె ఒత్తిడి చేయడం నిజం కాదా? అని నిలదీశారు. బడిదేవర కొండ మైనింగ్ విషయంలో అక్కడ తమ ఆరాధ్య దైవం కొలువై ఉందని గిరిజనులు చెప్పినా, వామపక్షాల నాయకులతో కలసి పోరాటం చేసినా.. మైనింగ్‌కు సిఫార్సు చేయడం ఏమిటన్నారు. ఆ విషయంలో నూ తహసీల్దార్‌పై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారన్నారు.
బేరాలు లేవు.. రేటు ఫిక్స్
తన వద్ద బేరాల్లేవు అని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే విజయచంద్ర.. ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేశారని ఆరోపించారు. రేషన్ డీలర్, అంగన్‌వాడీ ఉద్యోగాలను సైతం అమ్ముకున్నట్లు పత్రికల్లో కథనాలొచ్చాయని.. తన వద్ద కూడా పూర్తి ఆధారాలున్నాయని జోగారావు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన అంశాల మీద వివరణ ఇస్తున్న ఎమ్మెల్యే.. ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదన్నారు. రేషన్ డీలర్లు, అంగన్‌వాడీ పోస్టులను విక్రయించారా? లేదా? గోశాలలకు రూ.23 వేలు కప్పం కట్టాలంట.. నిజం కాదా? ఉపాధి వేతనదారుల నుంచి వారానికి రూ.200 చొప్పున వసూలు చేస్తున్నది నిజమా, కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్లు, అపార్ట్‌మెంట్ ఎలా వచ్చాయి?
తహసీల్దార్ జయలక్ష్మి అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బుల్డోజర్ ఎమ్మెల్యే.. మున్సిపల్ కమిషనర్ తాను డబ్బులిచ్చి, ఈ పోస్టులోకి వచ్చానని, డబ్బులు తీసుకుంటానని బహిరంగంగా చెబుతు న్నా ఎందుకు స్పందించడం లేదని జోగారావు
ప్రశ్నించారు. వరహాలగెడ్డ ఆక్రమణల పేరిట నోటీ సులు పంపించి, ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. 11 నెలల్లో ఎమ్మెల్యేపై ముగ్గురు బీసీ మహి ళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వీటి గురించి ఏ రోజూ ఎందుకు స్పందించలేదన్నారు. ‘దేవునిబంద ఆక్రమణలపై నా మీద ఆరోపణలు చేశావ్.. నేను తప్పు చేస్తే దోషిగా నిలబెట్టు. దేవునిబంద విషయంలో నాడు హడావిడి చేశావ్.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. దాంట్లో ఆక్రమణ దారులెవరు? మీ రెండు ఖరీదైన కార్లు, విజయనగరంలో అపార్ట్‌మెంట్ ఎలా కొన్నావ్.. ఏ విషయంలో బహుమతులు వచ్చాయి.. వాస్తవాలు చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.
బెదిరింపులు, కక్షసాధింపు మీ పాలన!
ఏమీ చేయలేక, నిరూపించలేక చివరికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మీద కక్ష సాధిస్తున్నార ని జోగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడ్డాపుశీల
బీసీలంటే ఎమ్మెల్యేకు నచ్చదేమో : చైర్‌పర్సన్