
వైభవంగా శ్యామలాంబ తొలేళ్ల ఉత్సవం
● నేడు సిరిమాను ఊరేగింపు
సాలూరు: శ్యామలాంబ అమ్మవారి పండగలో రెండో రోజైన సోమవారం తొలేళ్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాలు, కోలాట ప్రదర్శనల నడుమ జన్నివారి గద్దె నుంచి ఘటాలను పెదకోమటిపేట గద్దె వద్దకు తీసుకొచ్చారు. అక్కడ పూజలు అనంతరం జన్నివానితో కలిసి అన్ని వీధుల్లోనూ ఘటాలను ఊరేగింపు చేశారు. అక్కేనవీధిలోని పూజును, ముత్యాల బుట్టను(పాలజంగిడి) తీసుకుని రావడంతో తొలేళ్ల ఉత్సవం ప్రారంభమయింది. పెద్దలు మేళతాళాలతో యువరాజును తీసుకురాగా ఆయన సమక్షంలో పూజు, పాలజంగిడి, అమ్మవారికి ప్రత్యేక పూజలుచేశారు. భక్తుల జై శ్యామలాంబ నామస్మరణ నడుమ పెద్దల సమక్షంలో పూజు, పాలజంగిడిని ఊరేగింపు చేశారు. పూజు కర్రను యువరాజు పెదకోమటిపేట వద్ద ఉన్న అమ్మవారి గద్దెకు
చేర్చడంతో తొలేళ్ల ఉత్సవం ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం జరగనున్న సిరిమాను ఉత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు సన్నద్ధమవుతున్నారు.
శ్యామలాంబ తల్లి సేవలో డీవీజీ
సాలూరు: పట్టణంలోని శ్యామలాంబ అమ్మవారిని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

వైభవంగా శ్యామలాంబ తొలేళ్ల ఉత్సవం

వైభవంగా శ్యామలాంబ తొలేళ్ల ఉత్సవం

వైభవంగా శ్యామలాంబ తొలేళ్ల ఉత్సవం

వైభవంగా శ్యామలాంబ తొలేళ్ల ఉత్సవం