
కనులపండువగా శ్యామలాంబ పండగ ప్రారంభం
సాలూరు: శ్యామలాంబ అమ్మవారి ఉత్సవం కనులపండువగా ప్రారంభమైంది. ఆదివారం ఉయ్యాలకంబాల వేడుకను పెదకోమటిపేట గద్దె వద్ద సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. గద్దె వద్ద ఏర్పాటుచేసిన ఉయ్యాలలో జమిందార్ కుటుంబానికి చెందిన విక్రమచంద్ర సన్యాసిరాజు, తదితరులను ఉయ్యాలలో కూర్చోబెట్టి పెద్దలు ఊపారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకను తిలకించేందుకు తరలివచ్చారు. స్వల్ప తోపులాట నేపథ్యంలో యువరాజు, పెద్దలు కొంత ఇబ్బందిపడ్డారు. కార్యక్రమంలో సీ్త్రశిశు,గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌పీ భంజ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు తొలేళ్ల ఉత్సవం
సోమవారం తొలేళ్ల ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జన్నివీధిలో ఉన్న అమ్మవారి గద్దె నుంచి ఘటాను గొల్లవీధి వాసులు తీసుకొస్తూ కర్రలతో సాము చేస్తారు. ఒక వీధి తరువాత మిగిలిన వీధి వాసులంతా ఈ ఉత్సవంలో పాల్గొని ఘటాలను ఊరేగిస్తారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మాధవరెడ్డి
పండగ నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. ఆదివారం పట్టణానికి వచ్చిన ఆయన సిరిమాను తిరిగే ప్రాంతాలు, పార్కింగ్ తదితర అంశాలపై ఆరా తీసి అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. కంట్రోల్‌రూమ్‌ను పరిశీలించారు.
ఇబ్బందులు పడిన పోలీసులు
సుమారు వెయ్యి మంది పోలీసులు ఈ ఉత్సవానికి బందోబస్తు నిమిత్తం వచ్చారు. అయితే బందోబస్తు పోలీసులకు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి అక్కడ విద్యుత్ వెలుగులు లేకపోవడంతో చీకట్లో పోలిసులు భోజనాలు చేయడం కనిపించింది. సెల్‌ఫోన్‌లైట్లు వేసుకుని, అటుగా వచ్చే వాహనాల వెలుతురు మధ్య పలువురు పోలీసులు భోజనాలు చేస్తూ ఇబ్బందులు పడ్డారు.

కనులపండువగా శ్యామలాంబ పండగ ప్రారంభం

కనులపండువగా శ్యామలాంబ పండగ ప్రారంభం

కనులపండువగా శ్యామలాంబ పండగ ప్రారంభం

కనులపండువగా శ్యామలాంబ పండగ ప్రారంభం