
వైభవంగా పైడితల్లమ్మ దేవర మహోత్సవం
● వేపాడ, వల్లంపూడి గ్రామాల్లో భక్తజనం
● 19న తొలేళ్లు, 20 అమ్మవారి పండగ
వేపాడ: మండలంలోని వల్లంపూడి గ్రామదేవత పైడితల్లమ్మ పండగ సందర్భంగా మంగళవారం దేవర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం గ్రామానికి చెందిన పెద్దవీధి చేనేత కార్మికులు 42 అడుగులు, చిన్నవీధివారు 40 అడుగుల ఎత్తులో ప్రభలను ఊలుతో అలంకరించారు. వేపాడ, వల్లంపూడి జంటగ్రామాల్లో ప్రభలను ఊరేగింపు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయం ప్రాంగణ సమీపంలో రెండు ప్రభలను నిలిపారు. 19న తొలేళ్ల ఉత్సవం రోజు ఊలు అలంకరణ మార్పుచేసి నిలపనున్నారు. 20న అమ్మవారి పెద్దపండగ జరగనుంది.