
భారత సైన్యానికి క్రీడాభివందనాలు
శృంగవరపుకోట: భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో ఆదివారం బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. భారత దేశ ప్రజల ధన,మాన ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్న మన భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి మద్దతుగా కీడ్రాకారులు ర్యాలీ నిర్వహించారు. శిక్షణ శిబిరం కోచ్, ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టరు పొట్నూరు శ్రీరాములు ఆధ్వర్యంలో కేంబ్రిడ్జి స్కూల్ నుంచి దేవీ బొమ్మ, వన్‌వే ట్రాఫిక్ పెద్దవీధి, కాపువీధి మీదుగా భారత్ మాతాకి జై అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు.