
పత్రికా స్వేచ్ఛపై దాడి అమానుషం
పాలకొండ/ పాలకొండ రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి నుంచి పలు రకాలుగా పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని పాలకొండ ప్రస్‌క్లబ్ సభ్యులు ఆరోపించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడికి నిరసనగా గురువారం సాయంత్రం పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ బాలమురళీకృష్ణ, గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సభ్యులు యామల ఈశ్వరరావు, రాకోటి కోటి, రాజాన చంటి, వంశీ, కళ్యాణ్, సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.
హేయమైన చర్య
ప్రజల కోసం నిరంతంరం పనిచేసే పత్రికలపై కక్షసాధింపు చర్యలు సమంజసం కాదు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండా దాడి చేయడం సరికాదు.
– బత్తుల వెంకటరమణ,
పాలకొండ ప్రెస్ క్లబ్ గౌవర సలహాదారు
● సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడిని ఖండించిన పాలకొండ ప్రెస్ క్లబ్

పత్రికా స్వేచ్ఛపై దాడి అమానుషం