ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌ను సందర్శించిన డీఐజీ | - | Sakshi
Sakshi News home page

ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌ను సందర్శించిన డీఐజీ

Apr 4 2025 12:45 AM | Updated on Apr 4 2025 12:45 AM

ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌ను సందర్శించిన డీఐజీ

ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌ను సందర్శించిన డీఐజీ

డెంకాడ: చింతలవలసలోని ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్‌ను విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి గురువారం సందర్శించారు. ఆయనకు బెటాలియన్‌ కమాండెంట్‌ మాలికాగార్గ్‌ మొక్కను అందించి స్వాగతం పలికారు. బెటాలియన్‌లోని పోలీస్‌ శిక్షణ కేంద్రంలో మౌలిక వసతులను డీఐజీ పరిశీలించారు. తరగతి గదులు, ఆఫీస్‌, వంటగది, డైనింగ్‌ హాల్‌, స్టోర్‌, వాష్‌ రూంలను పరిశీలించారు. మినరల్‌ వాటర్‌ప్లాంట్‌, లైబ్రరీ, పరేడ్‌ గ్రౌండ్‌ స్థితిగతుల వివరాలను మాలికాగార్గ్‌ను అడిగి తెలుసుకున్నా రు. వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఎస్పీ వకుల్‌ జిందల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement