నెట్‌బాల్‌ పోటీలకు గొట్లాం విద్యార్థులు | Sakshi
Sakshi News home page

నెట్‌బాల్‌ పోటీలకు గొట్లాం విద్యార్థులు

Published Wed, Nov 8 2023 1:44 AM

నెట్‌బాల్‌ పోటీలకు ఎంపికై న విద్యార్థులను 
అభినందిస్తున్న ఉపాధ్యాయులు - Sakshi

బొండపల్లి: రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలకు బొండపల్లి మండలంలోని గొట్లాంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువుతున్న నలుగురు విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం జీఎస్‌ఆర్‌.మూర్తి, పీడీలు యు.సత్యానంద్‌, ఎల్‌వీ రమణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న ఎం.లిఖిత, ఎ.లేమియా, కె.రిషేంద్ర, ఎస్‌.సుశాంత్‌లను వారు అభినందించారు. ఈనెల 4న దత్తిరాజేరు మండలంలోని గడసాం హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెలలో నెల్లూరు జిల్లాలో జరగనున్న రాష్ట్రస్ధాయి పోటీల్లో తమ విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement