పశుపోషణతో ఆర్థిక ప్రగతి

సదస్సులో పాల్గొన్న వివిధ విభాగాల సిబ్బంది, రైతులు  - Sakshi

చీపురుపల్లిరూరల్‌(గరివిడి):

శుపోషణతో ఆర్థికాభివృద్ధి సాధ్యమని తిరుపతి పశువైద్య కళాశాల విభాగాధిపతి జి.వెంకటనాయుడు అన్నారు. గరివిడి వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో అసోసియేట్‌ డీన్‌ మక్కేన శ్రీను ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతీ రైతుకు పశుపోషణ, పశుయాజమాన్యం, పశుఆరోగ్యం, పశువృద్ధిపై స్పష్టమైన అవగాహన అవసరమన్నారు. అధిక పాలదిగుబడికి అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పశుసంవర్థక శాఖ జేడీ వై.వి.రమణ మాట్లాడుతూ వ్యవసాయం, పాడి పరిశ్రమతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. జిల్లాలో సుమారు 5 వందల రైతుభరోసా కేంద్రాలు రైతులకు సేవలందిస్తున్నాయని తెలిపారు. పశుగ్రాసం విత్తనాలు (75 శాతం), మిశ్రమ దాణా (60 శాతం), చాక్‌కటర్స్‌ను రాయితీపై అందిస్తున్నామన్నారు. దేశీయగోజాతులను పరిరక్షణకు వైఎస్సార్‌ దేశీయ గోజాతి పథకాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. మనుషుల కోసం 104, 108 వాహనాల మాదిరిగానే పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1962 సంచార పశువైద్య వాహనాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. సదస్సులో నాబార్డు డీడీఎం నాగార్జున, వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, కళాశాల శాస్త్రవేత్తలు, వివిధ విభాగాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top