రక్షణ చ క్రధారి! | - | Sakshi
Sakshi News home page

రక్షణ చ క్రధారి!

Jan 24 2026 7:21 AM | Updated on Jan 24 2026 7:21 AM

రక్షణ చ క్రధారి!

రక్షణ చ క్రధారి!

రక్షణ చ క్రధారి! డ్యూటీ కంటే గంట ముందుగా వస్తా ఆదర్శంగా ఉండాలన్నదే లక్ష్యం

ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేర్చడమే వారి బాధ్యత రద్దీని తట్టుకుంటూ ఓపిక తెచ్చుకుంటూ నడుపుతున్న వైనం నియామకాలు లేకపోవడంతో ఉన్న వారిపై పని భారం జిల్లాలో 6 డిపోలు .. 715 మంది ఆర్టీసీ డ్రైవర్లు నేడు రాష్ట్ర రోడ్డు రవాణా డ్రైవర్ల దినోత్సవం

సత్తెనపల్లి: ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడంలో డ్రైవర్ల పాత్ర కీలకం. ఏటా జనవరి 24న రాష్ట్ర రోడ్డు రవాణా డ్రైవర్ల దినోత్సవం జరుపుతున్నారు. పల్నాడు జిల్లా పరిధిలో ఆరు బస్సు డిపోలు ఉన్నాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల డిపోల్లో 715 మంది డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు ప్రతిరోజు 1.65 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

నియామకాలు లేక పని భారం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 12 ఏళ్లుగా నియామకాలు చేపట్టలేదు. వేల మంది డ్రైవర్లు ఉద్యోగ విరమణ, మెడికల్‌ అన్‌ఫిట్‌ పొందుతున్నారు. నియామకాలు లేకపోవడంతో ఉన్న డ్రైవర్లతోనే డబుల్‌ డ్యూటీలు చేయిస్తున్నారు. దీంతో డ్రైవర్లకు సరైన విశ్రాంతి ఉండటం లేదు. రిటైర్డు అయిన డ్రైవర్లకు పెన్షన్‌ తక్కువ మొత్తంలో వస్తోంది. దీంతో చాలామంది డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఆదుకోని ప్రభుత్వాలు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ప్రమాద బీమా అమలు చేయాలని ఆర్టీసీ డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు. పిల్లలు చదువులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. వాహనాలు పెరుగుతున్నంత వేగంగా రోడ్ల విస్తరణ చేపట్టడం లేదు. ఉన్న రోడ్లను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో డ్రైవర్లపై ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి తోడు కండిషన్‌ లేని బస్సులతో నడపాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్ల కష్టాలను గుర్తించి సమస్యలు పరిష్కరిస్తే మరింత భద్రంగా ప్రజల క్షేమం కోసం పాటుపడతామని డ్రైవర్లు కోరుతున్నారు.

గత ఏడాది ఆదర్శ వాహన చోదక అవార్డులు పొందిన డ్రైవర్లు : 18 మంది

గత ఏడాది ఒక్క ప్రమాదం కుడా చేయని డ్రైవర్లు : 70 శాతం పైనే

నా డ్యూటీ సమయానికి కంటే గంట ముందుగానే వచ్చి బస్‌ కండిషన్‌ చూసుకుంటా. ఆ తర్వాత సీట్లో కూర్చుంటా. సీట్లో కూర్చున్నాక ఇక నాకు ఇతర వ్యాపకాలు ఏవీ గుర్తుకు రావు. కేవలం బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంపైనే దృష్టంతా ఉంటుంది. నేను 28 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నా సర్వీసులో ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా ఎరుగను.

–షేక్‌ రషీద్‌, ఆర్టీసీ డ్రైవర్‌, సత్తెనపల్లి

డ్యూటీ అంటే కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి. విధి నిర్వహణలో బస్‌కండీషన్‌ ఎలా ఉందనేది ముందుగా చూసుకోవాలి. డ్రైవర్‌ వృత్తిలో ఆదర్శంగా ఉండాలన్నదే లక్ష్యం. నా సర్వీసులో అనేక సార్లు బెస్ట్‌ కేఎంపీఎల్‌ డ్రైవర్‌గా నిలిచా. డిపో ఒక లీటర్‌ ఆయిల్‌ 5.27 కిలో మీటర్లు రావాలని లక్ష్యంగా నిర్దేశిస్తే నేను 5.68 కిలో మీటర్లు తీసుకువచ్చా.

– కె.కోటేశ్వరరావు, బెస్ట్‌ కేఎంపీఎల్‌ ఆర్టీసీ డ్రైవర్‌, సత్తెనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement