ముక్కోటి మహోత్సవాలను విజయవంతం చేయాలి
మంగళగిరి టౌన్ : అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను ప్రశాంతంగా సజావుగా విజయవంతం అయ్యేలా కృషి చేయాలని మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర సూచించారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో గురువారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో ముక్కోటి ఏకాదశి పర్వదిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ మంగళగిరిలో వేంచేసి యున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్, ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, పట్టణ ఎస్‌ఐ రవీంద్రనాయక్, యూపీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూషలతో పాటు విద్యుత్‌శాఖ, ఎస్సైజ్‌శాఖ, ఆర్‌టిసి, అగ్నిమాపక శాఖల అధికారులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
బీ.ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ(పెదకాకాని): ఈ ఏడాది సెప్టెంబరు నెలలో జరిగిన బీ.ఫార్మసీ ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఏఎన్‌యూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. మొత్తం పరీక్షకు 370 మంది హాజరు కాగా 211 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2070 ఫీజు చెల్లించాలన్నారు.
ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ఫార్మా.డి మొదటి సెమిస్టర్‌కు 285 మంది హాజరు కాగా వారిలో 194 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్‌కు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.
గుంటూరు రైల్వే స్టేషన్‌లో
సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : గుంటూరు రైల్వే స్టేషన్‌లో 500 కేవీపీ, గ్రిడ్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించడం సంతోషకరమని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ సుధేష్ణసేన్ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను డీఆర్‌ఎం ప్రారంభించారు. ముందుగా సౌర విద్యుత్ ప్లాంట్ వివరాలు సంబంధిత అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సౌర ప్లాంట్ సుమారు 8.10 లక్షల యూనిట్లు శుద్ధ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రూపొందించడం జరిగిందన్నారు.
నేటి నుంచి గుంటూరులో క్రెడాయ్ ఎక్స్‌పో
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): క్రెడాయ్ 8వ ప్రాపర్టీ ఎక్స్‌పోను ఈనెల 12, 13, 14 తేదీల్లో సిద్ధార్థ కన్వెన్షన్ హాల్ (గుంటూరు రింగు రోడ్‌లో) నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ ఏపీ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి గురువారం తెలిపారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రాపర్టీ షో కొనసాగుతుందని అన్నారు. బ్యాంక్‌లు, బిల్డర్స్, మెటీరియల్ దుకాణాలు, కన్‌స్ట్రషన్స్ దుకాణాల నిర్వాహ కులు పాల్గొంటారని పేర్కొన్నారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ మామిడి రాము, షో కన్వీనర్ తియ్యగూర వినోద్‌రెడ్డి, క్రెడాయ్ కార్యదర్శి మెట్టు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఈ షోకు వచ్చేందుకు ప్రవేశం ఉచితమని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు శివనాగేశ్వరరావు, కోశాధికారి ఆళ్ళ నాగార్జునరెడ్డి, ఈసీ కళ్యాణ్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ముక్కోటి మహోత్సవాలను విజయవంతం చేయాలి


