కన్నీరు పెట్టించిన కుటుంబసభ్యుల ఆవేదన
విలపించిన పీఆర్కే తల్లి, సోదరి
మాచర్ల: ‘ఇంట్లో ఉన్నా.. నీకు ఏమీ తెలియకున్నా... హత్య కేసు పెట్టి నిన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంటి వద్ద లేకుండా చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందయ్యా...’ అంటూ వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పీవీఆర్‌లను పట్టుకొని ఏడుస్తూ వారి తల్లి రమణమ్మ, సోదరి నాగలక్ష్మిలు విలపించారు. గురువారం వారు కోర్టుకు హాజరయ్యేందుకు బయలుదేరిన సమయంలో వారిని పట్టుకుని బాధపడుతూ ’మనకిదేందయ్యా.. మంచి చెయ్యటమే మనం చేసిన పాపమా’ అంటూ వారు ఆవేదన చెందారు. ఆ సమయంలో విషాద వదనంతోనే పీఆర్కే, పీవీఆర్‌లు వారిని ఓదార్చారు. ‘ఏం కాదులే’ అంటూ ధైర్యం చెప్పారు. పక్కనే ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, న్యాయవాది రామలక్ష్మీరెడ్డిలు ఓదార్చారు. వారిద్దరూ తల్లికి, చెల్లికి కరచాలనం చేసి కోర్టుకు బయలుదేరి వెళ్లారు. ఆ దృశ్యాలు అందరిని కలచివేశాయి.
వెల్లువెత్తిన సానుభూతి..
పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు పెట్టడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం నాయకులు కుట్ర పూరితంగా జంట హత్య కేసులో వీరిని ఇరికించి ఇబ్బందులు పెట్టడంపై వారి పట్ల సానుభూతి నెలకొంది. ఎక్కడ చూసినా ఇదేం రాజకీయం అనుకుంటున్నారు. పిన్నెల్లి సోదరులను జైలు పాలు చేసేలా టీడీపీ చేస్తున్న కుట్రను ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు.
కన్నీరు పెట్టించిన కుటుంబసభ్యుల ఆవేదన
కన్నీరు పెట్టించిన కుటుంబసభ్యుల ఆవేదన


