ప్రజల మద్దతున్న పీఆర్కేపై కేసులా?
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం
ఇన్‌చార్జి అన్నా వెంకట రాంబాబు
మాచర్ల రూరల్: పల్నాడు చరిత్రలో వరుసగా నాలుగుసార్లు గెలిచి ప్రజల మద్దతు ఉన్న పీఆర్కేను రాజకీయంగా అణచివేసే ధోరణిలోనే అక్రమ కేసు నమోదు చేశారని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్‌చార్జి అన్నా వెంకట రాంబాబు అన్నారు. అక్రమ కేసులకు, వేధింపులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు భయపడబోరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై వేధింపులకు దిగుతూ, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగనన్న నాయకత్వంలో ఇలాంటి అక్రమ కేసులను ఎదుర్కొని మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు.


