గురజాల నియోజకవర్గంలో జోరుగా కోటి సంతకాల సేకరణ
గురజాల: రాష్ట్రంలో సామాన్యుల ప్రాణాలకు భరోసా కల్పించే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైద్య కళాశాలలను నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి పీపీపీ ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సారధ్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు గ్రామాల్లో ఉత్సాహంగా సాగుతున్నాయి. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఒక మహాయజ్ఞంగా జరుగుతుంది. ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తూ వైద్య విద్యను వ్యాపారమయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గురజాలలో ఇలా...
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. గురజాల నియోజకవర్గం నుంచి 60 వేల సంతకాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 40వేలకు పైగా సంతకాల సేకరణ జరిగింది. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. గురజాల నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లో సంతకాల సేకరణ లక్ష్యం దిశగా అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా సామాన్యులు, చిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు, కార్మికులు ప్రతి ఒక్కరూ విధిగా వచ్చి సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యను పేదలకు దూరం చేయొద్దు.....నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం దూరం చేయొద్దు అంటూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు.
గురజాల నియోజకవర్గంలో జోరుగా కోటి సంతకాల సేకరణ


