జిల్లా విద్యాశాఖాధికారిగా రామారావు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పి.వి.జె.రామారావు నియమితులయ్యారు. ప్రభుత్వం మంగళవా రం విద్యాశాఖలో చేపట్టిన డీఈఓల బదిలీలలో భాగంగా కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తిస్తు న్న రామారావు బోయపాలెం డైట్ కళాశాల ప్రిన్సిపల్ బాధ్యతలతోపాటు పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి(డీఎస్‌ఈఓ)గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రామారావు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరావుపేట డిప్యూటీ డీఈఓగా, అడిషనల్ డైరెక్టర్–1 బాధ్యతలు నిర్వర్తించారు. బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న ఎల్.చంద్రకళ కృష్ణాజిల్లా అంగలూరు డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా, ఎన్‌టిఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి (డీఎస్‌ఈఓ)గా బదిలీపై వెళ్లనున్నారు.
శిలాఫలకాలు, ఆర్చీలపై వైఎస్సార్ సీపీ నాయకుల పేర్లు ధ్వంసం
నాదెండ్ల: మండలంలోని చిరుమామిళ్ల గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అభివృద్ధి పథకాల శిలాఫలకాలను టీడీపీ వర్గీయులు ధ్వంసం చేసిన ఉదంతం మంగళవారం చోటుచేసుకుంది. మోడల్ స్కూలు–బీసీ కాలనీ రహదారికి అప్పటి మంత్రి విడదల రజిని పేరిట ఆర్చి నిర్మించారు. తాజాగా ఆర్చిలోని ఆమె పేరును తొలగించారు. శ్మశానవాటికలో నిర్మించిన ఆర్చిని, కమ్యూనిటీ హాలుకు గల వైఎస్సార్ సీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి పేరును ధ్వంసం చేశారు. అమూల్ డెయిరీ, రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ సెంటర్‌లో శిలాఫలకాలపై సర్పంచ్ సింగారెడ్డి లక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు సింగారెడ్డి కోటిరెడ్డి పేర్లను తొలగించారు. టీడీపీ వర్గీయుల దుశ్చర్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరుతున్నారు.


