గ్రామాల్లో మిన్నంటిన రోదనలు
నూజెండ్ల: ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటారని తల్లిదండ్రులకు చివరకు కన్నీరే మిగిలింది. చిలకలూరిపేట సమీపంలో గణపవరం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతిచెందిన విషయం విదితమే. నూజెండ్ల మండలం ములకలూరు గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. శుక్రవారం ఇరువురి మృతదేహాలను గ్రామానికి తీసుకువచ్చారు. విగత జీవులుగా మారిన పిల్లలను చూసిన తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడు గొడవర్తి యశ్వంత్‌సాయి (20) గుంటూరులోని చలపతి ఇంజినీరింగ్ కాలేజీ, వంగవల్లు వాసు (22) విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు తోటి మిత్రులతో కలసి అయ్యప్పమాల ఽవేసుకున్నారు. శనివారం గ్రామంలో ఇరుముడి కార్యక్రమం ఉండటంతో స్నేహితులతో కలిసి కారులో బయలుదేరారు. కంటైనర్‌ను వేగంగా ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు.
అల్లారు ముద్దుగా పెంచుకున్నారు..
సుబ్బరామయ్య, కుమారి దంపతుల రెండో కుమా రుడు యశ్వంత్‌సాయి. భార్యాభర్తలు ఇరువురూ ఉద్యోగస్తులే. సుబ్బరామయ్య సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్‌గాను, భార్య కుమారి నూజెండ్లలోని వైద్యశాలలో ఏఎన్‌ఎంగా పనిచేస్తుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారు డు దూరమవటంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. చేతికి అందివచ్చాడనుకున్న కొడుకు దూరమయ్యాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
వెంటాడిన మృత్యువు..
చలపతి కాలేజీలో చదువుతున్న యశ్వంత్‌సాయిని మృత్యువు వెంటాడింది. సాయి వినుకొండ రావడానికి గుంటూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అదే సమయంలో మిత్రులు ఫోన్ చేసి కారులో వెళ్తున్నాం, రావాలని కోరారు. మిత్రులతో కలసి వినుకొండ బయలుదేరాడు. మార్గంమధ్యలో జరిగిన ప్రమాదంలో సాయి ప్రాణాలు కోల్పోయాడు.
ఒకే ఒక్కడు...
వెంకట్రావు, నాగరాజ దంపతుల ఏకై క సంతానం వంగవల్లు వాసు. వెంకట్రావుది వ్యవసా య నేపథ్యం కావడంతో కొడుకుని చక్కగా చదివించి మంచి ఉద్యోగస్తుడిగా చూడాలని కలలు కన్నారు. ఆ కలలు కల్లలుగా మారాయి. కొడుకు మృత్యు ఒడికి చేరడంతో ఆ తల్లిదండ్రులు పెట్టిన రోదనలు అక్కడ ఉన్న వారందరినీ కంటితడి పెట్టించాయి.
కన్నీరు మున్నీరుగా..
పిడుగురాళ్ల: ఇంజినీరింగ్ చదువుతున్న కొడుకును చూసి మురిసిపోయిన తల్లిదండ్రులకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గురువారం చిలకలూరిపేట సమీపంలో కారు లారీని ఢీకొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందగా వారిలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన శివరాత్రి మహేష్ ఉన్నాడు. తండ్రి చిన్ని, తల్లి నాగమణిలకు మహేష్ రెండో కుమారుడు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకుంటున్నా డు. తండ్రి చిన్ని తాపీ వర్కర్‌గాను తల్లి నాగమణి మిషన్ కుడుతూ కుటుంబానికి పోషిస్తున్నారు.
గ్రామాల్లో మిన్నంటిన రోదనలు
గ్రామాల్లో మిన్నంటిన రోదనలు
గ్రామాల్లో మిన్నంటిన రోదనలు


