ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్
నాదెండ్ల: విధుల్లో అలసత్వం వహించిన వైద్యులు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. పల్నాడు జిల్లా గణపవరం పీహెచ్‌సీని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ సందర్శించిన విషయం విదితమే. ఆ సమయంలో ఆసుపత్రికి తాళాలు వేసి ఉండటం గమనించి విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ కె పద్మావతి, పల్నాడు డీఎంహెచ్‌వో రవికి సమాచారమిచ్చారు.గురువారం డాక్టర్లు కవితా అనసూయ, ప్రసాద్‌నాయక్, ఎంపీహెచ్‌ఈవో శ్రీనివాసరెడ్డి, హెచ్‌ఈ అంజమ్మ, ఎస్‌ఎ హనుమంత్‌నాయక్, స్టాఫ్‌నర్సు లు అరుణ, విజయ, మస్తాన్‌బి, ఎల్‌టీ అరుణకుమారి, సూపర్‌వైజర్లు రహిమాన్‌బాషా, జానకీదేవి, ఎఫ్‌ఎన్‌వో పుట్లమ్మలను సస్పెండ్ చేశారు. వీరి స్థానంలో చిలకలూరిపేట ఏరి యా ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్న షేక్ సుమయా, హరిహరన్‌తో పాటూ ఎనిమిది మంది సిబ్బందిని నియమించారు. శుక్రవారం వీరు పీహెచ్‌సీలో వైద్య సేవలందించారు.
ఎన్జీ రంగా వ ర్సిటీలో
ప్రపంచ మృత్తికా దినోత్సవం
గుంటూరురూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసా య విశ్వవిద్యాలయంలో ప్రపంచ మృత్తికా ది నోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ ప్రతి ఏటా డిసెంబర్ 5న నేల ప్రాముఖ్యతను గుర్తుంచుకోవటానికి ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ మృత్తికా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. మృత్తికాశాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.శైలజ ఈ ఏడాది ఆరోగ్య పట్టణాల కోసం ఆరోగ్యమైన నేలలు అనే అంశంపై అవగాహన కల్పించారు. పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ ఏవీ రమణ మాట్లాడుతూ నేల లోపల కోటాను కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ, డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, డాక్టర్ డి.సంతప్‌కుమార్, డీన్ డాక్టర్ పి.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు కృష్ణ నగర్‌కు చెందిన మట్ట శ్రీనివాస్, జయలక్ష్మి, పద్మావతి ఆలయ ఈవో శీనానాయక్‌ను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఈఓ శీనునాయక్ తెలిపారు.
డాక్టర్ భరత్‌కుమార్‌కు జాతీయస్థాయి గౌరవం
పిడుగురాళ్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిడుగురాళ్ల శాఖ అధ్యక్షులు డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్‌కుమార్‌కు జాతీయ స్థాయి గౌరవ అవార్డు దక్కింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సర్బారీ దత్త ఈ అవార్డు ప్రకటించటం జరిగిందని తెలిపారు. భరత్‌కుమార్ చేసిన ఫీల్డ్ వర్క్, నాయకత్వ లక్షణాలకు ఈ గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక గౌరవ అవార్డు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా మోడ్రన్ మెడికల్ సేవలు, సంఘ సేవలు, నాయకత్వంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన శాఖ అధ్యక్షులకు ప్రదానం చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది భరత్‌కుమార్‌కు ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ అభినందనలతో కూడిన గౌరవ అవార్డు దక్కింది. భరత్‌కుమార్‌ను పలువురు అభింనందించారు.
ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్
ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్
ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్


