11న స్థానిక సంస్థల్లో ఖాళీల భర్తీకి ఉప ఎన్నికలు
గుంటూరుఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ మండల పరిషత్‌లలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు ఈనెల 11న ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మాచవరం మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవితోపాటు, ఫిరంగిపురం మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్, రాజుపాలెం, వేమూరు మండల ప్రజా పరిషత్ కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా ఎన్నికల నిర్వహణకు అధికారులను నియమించారు.
గుంటూరు వైద్య కళాశాలలో ఫార్మకాలజీ జాతీయ సదస్సు
పర్యావరణహితంగా పరిశోధనలు జరగాలి
గుంటూరుమెడికల్:గుంటూరు మెడికల్ కాలేజీ ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాలలో జాతీయ స్థాయి సదస్సు ప్రారంభమైంది. సదస్సు రెండు రోజులపాటు జరగ నుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సంయు క్తంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఫార్మకాలజీ సొసైటీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మీనాకుమారి పాల్గొన్నారు. నెక్ట్స్‌జెన్ ఫార్మా అనే థీమ్‌తో రెండు రోజులపాటు జరగనున్న జాతీయ కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి ఫార్మ కాలజీ ప్రొఫెసర్లు, అసోసియేట్–అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ గుంటూ రు మెడికల్ కాలేజీ వేదికగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించ డం ఆనందంగా ఉందన్నారు. దీర్ఘకాలిక రోగాలకై కొత్త ఔషధాల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో మరిన్ని పరిశోధనలు జరగాలనే అన్నారు.


