మాతృ మరణాల నివారణకు చర్యలు
నరసరావుపేట: మాతృ మరణాలను నివారించేందుకు గర్భిణులకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి రక్తహీనతను నివారించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆదేశించారు. కార్యాలయంలో బుధవారం యడ్లపాడు, పమిడిపాడు, కొచ్చర ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపై వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, పారామెడికల్ సిబ్బందితో సమీక్ష చేశారు. గర్భిణులు, బాలింతల రక్తపోటును క్రమం తప్పకుండా నమోదు చేసి, నియంత్రించేందుకు వైద్య సేవలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ప్రసూన, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి, డీఎల్‌ఓ డాక్టర్ మాధవీలత, డాక్టర్ హనుమకుమార్, నీలకంఠేశ్వరరావు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి


