
భార్య కాపురానికి రావడం లేదని..
సత్తెనపల్లి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సత్తెనపల్లి మండలం భీమవరం–గుడిపూడి వెళ్లే రైల్వే గేటు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాల పాడు గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ బాషా (45) ధాన్యం గోతాల పట్టలు కుడుతూ జీవనం వెళ్లదీస్తున్నాడు. మృతుడికి భార్య అల్లీబి, కుమారుడు అబ్దు ల్, కుమార్తె తాహె రున్నీసా ఉన్నారు. కుమారుడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యనభ్యసిస్తుండగా, కుమార్తె పదవ తరగతి విద్యనభ్యశిస్తోంది. అహ్మద్ బాషా, భార్య అల్లీబిలు మేనత్త,మేనమామ పిల్లలు. కాగా అహ్మద్‌బాషా నిత్యం మద్యం సేవించి భార్య అల్లీబితో గొడవ పడుతుండడంతో భార్య అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి రెండు నెలల క్రితం వెళ్లింది. పలుమార్లు భార్యని ఇంటికి రమ్మని భర్త పిలిచినా .. మద్యం తాగడం మానుకుంటే ఇంటికి వస్తానని భార్య చెప్పడంతో మద్యం మత్తులో మనస్థాపానికి గురై న అహ్మద్ బాషా సత్తెనపల్లి మండలం భీమవరం–గుడిపూడి వెళ్లే రైల్వే గేటు వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు ఢీకొట్టడంతో మృతదేహం రెండు భాగాలుగా విడిపోయింది. అయితే కొంత వరకు అప్పులు కూడా ఉండడం ఆత్మహత్య కారణంగా తెలుస్తోంది. రైల్వే పోలీసులు సంఘ టనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైలుకింద పడి భర్త ఆత్మహత్య