
కోటప్పకొండ రెడ్లసత్రానికి రూ.5,00,116లు విరాళం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, రెడ్ల సత్రంకు పట్టణానికి చెందిన వ్యాపారి ఆవుల మురళీధర్‌రెడ్డి రూ.5,00,116 విరాళంగా అందించారు. గుంటూరు– వినుకొండరోడ్డు బైపాస్‌లోని మురళీధర్‌రెడ్డి వ్యాపార కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సత్రం కమిటీ సభ్యులకు విరాళం చెక్కు దాత అందజేశారు. కార్యక్రమంలో సత్రం కమిటీ అధ్యక్షుడు కంజుల వీరారెడ్డి, కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, కోశాధికారి మాగులూరి సుబ్బారెడ్డి, కమిటీ సభ్యులు యేరువ జయరామిరెడ్డి, బోయపాటి పుల్లారెడ్డి, నారసాని శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు.