
ఎరియర్స్ పీఎఫ్ ఖాతాలలో జమ కాకపోతే ఉద్యమం
సత్తెనపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఎరియర్స్ ఇప్పుడు ఇవ్వడం లేదన్న వార్త విని ప్రభుత్వ ఉద్యోగస్తుల ఆనందం ఆవిరైందని ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్‌ఎం.సుభాని అన్నారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సుభాని మాట్లాడుతూ ఎరియర్స్ ఇవ్వడం లేదన్న వార్తతో ఉద్యోగ వర్గాలు విస్మయానికి గురయ్యారన్నారు. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించిన డీఏలో ఎరియర్స్ రిటైర్ అయిన తరువాత ఇస్తామని చెప్పడం, సీపీఎస్ గురించి ప్రస్తావించక పోవడం దారుణమన్నా రు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగజేసు కుని ఎరియర్స్ పీఎఫ్ ఖాతాలలో జమ అయ్యే టట్లు చుడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను కలుపుకొని మెరుపు ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అసోసియేట్
అధ్యక్షుడు ఎస్‌ఎమ్.సుభాని