
బస్‌షెల్టర్‌లో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం
సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం కంటెపూడిలోని బస్సు షెల్టర్‌లో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం శుక్రవారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు సత్తెనపల్లి రూరల్ ట్రైనీ ఎస్‌ఐ ఆర్.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని సందర్శించి వృద్ధుడి మృతదేహన్ని పరిశీలించారు. సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయసుగల వృద్ధుడు తెల్ల చొక్కా, ఫ్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ 9440796231, 9490571949 నంబర్లకు తెలియజేయాలన్నారు.