
మహాత్మాగాంధీ జీవితం అందరికీ ఆదర్శం
13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్య శ్రీ సబ్ జైల్‌లో ఖైదీల సంక్షేమ దినోత్సవం
నరసరావుపేట టౌన్: మహాత్మా గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి కృషి చేయాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్య శ్రీ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని ఖైదీల సంక్షేమ దినంగా సబ్‌జైల్లో గురువారం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ, సబ్ జైలు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాట్లాడారు. పొరపాటునో గ్రహపాటునో వివిధ నేరాల్లో ఉన్నవారు భవిష్యత్తులో పరివర్తన చెంది ఎటువంటి క్షణికావేశాలకు లోనుకాకుండా నేర ప్రవృత్తిని విడనాడి శాంతియుత జీవనం గడపాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడాంశాలలో విజేతలకు ఆమె బహుమతి ప్రదానం చేశారు. మొదట మహాత్మా గాంధీ చిత్రపటానికి న్యాయమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపకారగారం పర్యవేక్షకులు సురభి అంజయ్య, డిప్యూటీ జైలర్ రాములు నాయక్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బ్లేస్సినా, సిబ్బంది పాల్గొన్నారు.