వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

Oct 4 2025 6:36 AM | Updated on Oct 4 2025 6:36 AM

వేర్వ

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): గుంటూరు రేంజ్‌లోని ప్రతి జిల్లాలో శాంతిభద్రతలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టర్‌ బంగ్లా రోడ్డులోని రేంజ్‌ ఐజీ కార్యాలయంలో దుర్గామాతకు విశేష పూజలు నిర్వహించారు. రేంజ్‌ ఐజీ మాట్లాడుతూ ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బందికి మిఠాయిలు అందించారు.

మేదరమెట్ల: బైక్‌ను కారు ఢీకొని భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కొరిశపాడు మండల పరిధిలోని వెంకటాపురం క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. జె.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన కొత్తూరు వెంకటసుబ్బారావు(55), భార్య లక్ష్మి(50)తో మోటారు బైకుపై ఒంగోలు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. వెంకటాపురం క్రాస్‌ వద్దకు రాగానే బైక్‌ను అలవలపాడు రోడ్డులోకి వెళ్లేందుకు మలుపు తిప్పుతుండగా ఇదే సమయంలో నెల్లూరు నుంచి ఏలూరు వెళ్తున్న కారు బైక్‌ను ఢీ కొంది. దీంతో బైక్‌పై ఉన్న భార్యాభర్త రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. అద్దంకి రూరల్‌ సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ మహ్మద్‌ రఫీ కేసు నమోదు చేశారు.

ఇద్దరు యువకులు దుర్మరణం

జరుగుమల్లి(సింగరాయకొండ): దసరా పండగ పూట రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు మార్జిన్‌లో ఆగి ఉన్న టిప్పర్‌ను ప్రమాదవశాత్తు మోటారు సైకిల్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మండల కేంద్రమైన జరుగుమల్లిలో పాల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కట్టా ప్రవీణ్‌(21), చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన శ్రీరాములు రాజు(20) ఇద్దరూ కలిసి చింతలపాలెం నుంచి టంగుటూరుకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు మార్జిన్‌లో నిలిపి ఉంచిన టిప్పర్‌ వెనుక భాగాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.మహేంద్ర తెలిపారు.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి1
1/2

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి2
2/2

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement