వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుల నియామకం

Oct 4 2025 6:36 AM | Updated on Oct 4 2025 6:36 AM

వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుల నియామకం

వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుల నియామకం

వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుల నియామకం రెండు బైక్‌లు ఢీ: యువకుడు మృతి నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన టీజీవీ కృష్ణారెడ్డి, పెదకూరపాడుకు చెందిన జాలయ్యను సెంట్రల్‌ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ (సీఈసీ) మెంబర్లుగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్సార్‌ సీపీ ఎస్‌ఈసీ మెంబర్లుగా ఇరువురు నియామకం..

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ముగ్గురిని స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఎస్‌ఈసీ) మెంబర్లుగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొమ్మారెడ్డి చలమారెడ్డి(మాచర్ల), ఈదా సాంబిరెడ్డి (పెదకూరపాడు), కొమ్మినేని వెంకటేశ్వర్లు (గురజాల) నియమితులయ్యారు.

మరొక వ్యక్తికి తీవ్రగాయాలు

రొంపిచర్ల: మండలంలోని మర్రిచెట్టుపాలెం, మాచవరం గ్రామాల మధ్య రహదారిపై శుక్రవారం రెండు మోటారు సైకిళ్లు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన వి.గోపిరెడ్డి (21) మర్రిచెట్టుపాలెం గ్రామంవైపు నుంచి మోటారు సైకిల్‌పై మాచవరం గ్రామం వెళుతుండగా అదే మార్గంలో నరసరావుపేట నుంచి కుంకులకుంట వెళుతున్న హుస్సేన్‌కు చెందిన మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపిరెడ్డి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన హుస్సేన్‌ను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

బాపట్ల: బాపట్ల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణకు డ్రోన్‌ నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసులను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రత్యేకంగా డ్రోన్‌ కెమెరాల ద్వారా సముద్రతీర పర్యాటక ప్రదేశాల్లో, శివారు ప్రాంతాలలో శుక్రవారం నిఘా ఏర్పాటు చేయించారు. సూర్యలంక, రామాపురం, వాడరేవు తదితర సముద్ర తీర ప్రాంతాలలో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాల గురించి సమారచారం తెలిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 112 కు కాల్‌ చేసి సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement