
సత్తెనపల్లిలో కుండపోత
సత్తెనపల్లి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం కుండపోత వర్షం కురిసింది. పట్టణంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైన వర్షం సాయంత్రం 4:30 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో పట్టణంలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ముఖ్యంగా పట్టణంలోని నాగన్నకుంట ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తాలూకా సెంటర్‌లో గల కోర్టు ప్రాంగణంలో, బాలికోన్నత పాఠశాల ప్రాంగణం, పాత కేంద్రియ విద్యాలయ ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచింది. అంతేగాక వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.