
న్యాయవాదులపై దాడులు అరికట్టాలి
సత్తెనపల్లి: తరచూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్‌కుమార్ అన్నారు. బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా సత్తెనపల్లిలో ఉన్న నాలుగు న్యాయస్థానాల్లో విధులను బహిష్కరించి తాలుకా న్యాయస్థానం ప్రాంగణంలోని న్యాయదేవత విగ్రహం వద్ద న్యాయవాదులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. అజయ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీస్ అధికారులపై, న్యాయవాద వృత్తిని, న్యాయవాదులను అవమానకరంగా మాట్లాడుతున్న పోలీస్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. నందిగామకు చెందిన న్యాయవాది కోట దేవదాస్‌పై నందిగామ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేయటాన్ని వ్యతిరేకించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కూడా న్యాయవాదులను, న్యాయవాద వృత్తిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో సురేష్ బాబు అనే న్యాయవాదిపై ఒక రౌడీ షీటర్ చేసిన దాడిని, తెలంగాణ రాష్ట్రంలో జస్టిస్ భీమపాక నగేష్ అనే న్యాయమూర్తిపై ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చిన్నం మణి బాబు, న్యాయవాదులు సయ్యద్ అబ్దుల్‌రహీమ్, దివ్వెల శ్రీనివాసరావు, జూపల్లి శేషయ్య, జొన్నలగడ్డ విజయ్‌కుమార్, రాజవరపు నరసింహారావు, ఇ.ఏడుకొండలు, బొక్కా సంగీతరావు, తవ్వా హరనాథ్, గుజ్జర్లపూడి సురేష్‌బాబు, చావా జోజీ, వడియాల పాపారావు, సాయిశ్రవణ్, ఎ.వి.కృష్ణారెడ్డి, పాటిబండ్ల రవికుమార్, మంగళపురి రామారావు, బత్తుల జయప్రకాష్, లాజర్ తదితరులు ఉన్నారు.
సత్తెనపల్లి బార్ అసోసియేషన్
అధ్యక్షుడు అజయ్‌కుమార్